విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ప్రకాశ్ రాజ్ కుమారుడు వేదాంత్ కోరిక మేరకు ఇలా చేసినట్టు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రకాశ్ రాజ్ భార్య పోనీ వర్మ, తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోల్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో ప్రకాశ్ రాజ్ పంచుకున్నారు. మా వివాహానికి సాక్షిగా వేదాంత్ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం అని ప్రకాశ్ రాజ్ తన ట్విట్లో తెలియజేశారు.
అయితే ప్రకాశ్ రాజ్ మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్ పోనీవర్మని ప్రకాశ్ రాజ్ 2010లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ కె.జి.యఫ్ చాప్టర్ 2, అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రాలతో పాటు రజినీకాంత్ అన్నాత్తే చిత్రాలతో బిజీగా ఉన్నారు.
We got married again tonight..because our son #vedhant wanted to witness it 😍😍😍. Family moments #bliss pic.twitter.com/Vl29VlDQb4
— Prakash Raj (@prakashraaj) August 24, 2021