టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్’. లాక్డౌన్ అనంతరం మళ్లీ సెట్స్ పైకి వచ్చింది ఈ మూవీ. సోమవారం హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లాక్డౌన్ నటుడు సోనూసూద్‌కు ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా రియల్ హీరో సోనూసూద్ లోకేషన్ లోకి ఎంటర్ కాగానే యూనిట్ సిబ్బంది అంతా చప్పట్లతో, ఉత్సాహంగా సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రకాశ్ రాజ్ సోనూకు శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. ఈ క్రమంలో అల్లుడు అదుర్స్ సెట్ లో సందడి వాతావరణం నెలకొంది. కష్టకాలంలో వలసకార్మికులకు అండగా నిలిచిన సోనూను మనస్ఫూర్తిగా అభినందించారు.
కాగా ఈ సినిమాలో అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. 8 ప్యాక్స్‌తో సరికొత్త లుక్‌లో కనిపించనున్నడు బెల్లంకొండ. ఈ సినిమాలో విలన్ పాత్రల్లో కనిపించనున్నాడు.