HomeTelugu Trendingఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది : ప్రకాశ్‌ రాజ్‌

ఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది : ప్రకాశ్‌ రాజ్‌

 

Prakash Raj about major mov
విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ నటించిన తాజా చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో అడివి శేష్ ప్రధాన పాత్రను పోషించాడు. హీరో మహేశ్ బాబు నిర్మించిన ఈ సినిమా, జూన్ 3వ తేదీన తెలుగుతో పాటు మలయాళ .. హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. ఇది హృదయాన్ని హత్తుకునే సినిమా అనీ, ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు.

“ఈ సినిమాలో నా పాత్ర ప్రతి ఒక్క రికీ కనెక్ట్ అవుతుంది. ఇందులో నేను కూడా ఒక భాగమైనందుకు సంతోషంగానూ, గర్వంగాను ఉంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన సినిమా ఇది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్ భార్య పాత్రలో రేవతి నటించగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu