నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చాయి ఇది వీరికి మూడో సినిమా. ఈ రెండు కూడా భారీ విజయం సొంతం చేసుకున్నాయి.
బాలకృష్ణను ఇందులో అఘోరా పాత్రలో కనిపిస్తున్నారని వినికిడి. బాలయ్య మాస్ హీరో… అటు బోయపాటి కూడా మాస్ దర్శకుడు కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సమ్మర్ స్పెషల్ గా సినిమాను విడుదల కాబోతుందట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ‘కంచె’ సినిమాలో నటించి మెప్పించిన ప్రగ్యా జైస్వాల్ ను తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ హీరోయిన్ బాలయ్యతో జత కట్టడం ఇదే మొదటిసారి. కంచె తరువాత ఆమెకు పెద్దగా విజయాలు రాలేదు. ఈ సినిమాతో అయినా ఈ బ్యూటీకి బ్రేక్ వస్తుందేమో చూడాలి.