
Dragon OTT release date:
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్రాగన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. టోటల్‌గా రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఈ ఏడాది తమిళంలో టాప్ గ్రాసర్‌గా నిలిచింది. ప్రేమ కథలతో నెక్ట్స్ లెవల్ ఎంటర్టైన్మెంట్ అందించే ప్రదీప్, ‘లవ్ టుడే’ తర్వాత మరో బిగ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ సినిమాకు అశ్వథ్ మరిముత్తు దర్శకత్వం వహించారు. తెలుగులో ‘Return of the Dragon’ పేరుతో విడుదలైన ఈ మూవీ, ఇక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహార్ హీరోయిన్లుగా నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ లాంటి స్టార్ డైరెక్టర్లు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
Will #Dragon survive the OTT test or X audience will bash it …? #Netflix pic.twitter.com/hjye9Ew4dw
— Lavyyy Boiiii ✨ (@Lavyyboi) March 18, 2025
ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘డ్రాగన్’ స్ట్రీమింగ్‌కి వస్తుంది. తమిళంతో పాటు, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. థియేట్రికల్ విండో అయిదు వారాలు మాత్రమే ఉండటంతో, ఓటీటీలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలున్నాయి.
ఏజీఎస్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఎమోషన్స్ కలిపిన కథ, యూత్‌ఫుల్ టచ్ ఈ సినిమాకు హైలైట్‌గా మారాయి. థియేటర్లలో పెద్ద విజయాన్ని సాధించిన ‘డ్రాగన్’ ఇప్పుడు ఓటీటీలోనూ కొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.
ALSO READ: Court State vs A Nobody OTT తో ఎంత లాభాలు నమోదు చేసుకుందో తెలుసా?