HomeTelugu Trendingత్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న ప్రదీప్‌!

త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న ప్రదీప్‌!

Pradeep machiraju marriage
యాంకర్‌ ప్రదీప్‌ పెళ్లి గురించి గత రెండు మూడు సంవత్సరాలుగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు ప్రదీప్ తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పే టైం వచ్చిందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రదీప్ మాచిరాజు రాబోయే మూడు నాలుగు నెలల్లో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. రాయలసీమకు చెందిన ఒక పొలిటికల్ పార్టీ నాయకుడి కూతురుతో ప్రదీప్ వివాహం జరుగబోతుంది. ఆ విషయమై ఇప్పటికే చర్చలు కూడా జరిగాయట. ఉన్నత విద్యావంతురాలైన అమ్మాయి ప్రస్తుతం కుటుంబంకు చెందిన వ్యాపారాలను చూసుకుంటుందట.

ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం నిశ్చితార్థం మరియు పెళ్లికి సంబంధించిన తేదీలను కూడా నిర్ణయించుకోవడం జరిగిందట. అతి త్వరలోనే ప్రదీప్ నుండి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. కాగా ప్రదీప్ హీరోగా నటించిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు ఓపెన్ చేసిన వెంటనే సినిమాను రీలిజ్‌ చేయాలని భావిస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu