Prabhu Deva to Lawrence:మూవీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ల కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. కొన్ని సినిమాల్లో పాటలే హైలైట్‌గా నిలుస్తాయి. ఈ క్రెడిట్ కొరియోగ్రాఫర్ కి కూడా దక్కుతుంది అనడంతో అనుమానం లేదు. వాళ్ళ వర్క్ గురించి ఒకప్పుడు పెద్దగా తెలిసేది కాదు. కానీ తర్వాత పలు డాన్స్ షోలు రావడంతో వాళ్లకి కూడా మంచి పబ్లిసిటీ దక్కడం మొదలైంది. ఇప్పుడు సోషల్ మీడియా హవా పెరగడంతో బుల్లితెరపై కూడా వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఇంకొంతమంది కొరియోగ్రాఫర్లు అయితే డైరెక్టర్లుగా కూడా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా డైరెక్టర్లుగా మారిన కొరియోగ్రాఫర్లు చూద్దాం..
లారెన్స్: ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ గురించి అందరకీ తెలిసిందే. 2004 లో మాస్ సినిమాతో దర్శకుడిగా మారాడు. నాగర్జున హీరోగా నటించిన ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. అయితే 2006లో తెలుగులో వచ్చిన స్టైల్ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కాంచన వంటి పలు సినిమా చేశాడు. తాజాగా చంద్రముఖి-2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అమ్మ రాజశేఖర్: హీరో గోపీచంద్ తో చేసిన ‘రణం’ సినిమాతో దర్శకుడిగా మారాడు అమ్మ రాజశేఖర్. ఆ తర్వాత ఖతర్నాక్, టక్కరి వంటి సినిమాలని కూడా డైరెక్ట్ చేశాడు. అమ్మ రాజశేఖర్ పలు టీవీ షోలకు జడ్జీగా వ్యవహరించడంతో పాటు బిగ్‌బాస్‌లో కూడా పాల్గోన్నాడు.
రాజు సుందరం: సుందరం మాస్టర్ కొడుకు రాజు.. కొరయోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అజిత్ తో ‘ఏగన్’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించింది. నవదీప్ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషించాడు. ఇదే సినిమా తెలుగులో ‘మల్లిక’ పేరుతో డబ్ అయ్యింది.
ప్రభుదేవా: ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. తన డ్యాన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. హిందీలో కూడా చాలా సూపర్ హిట్ మూవీస్ ను అందించాడు.
విజయ్ బిన్నీ: ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ మధ్యనే దర్శకుడిగా మారి నాగార్జునతో ‘నా సామి రంగ’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.
సుచిత్ర చంద్రబోస్: ‘పల్లకిలో పెళ్లి కూతురు’ అనే సినిమాకి డైరెక్షన్ చేశారు కొరియోగ్రాఫర్ సుచిత్ర. ఈమె ప్రముఖ సింగర్ చంద్రబోస్ సతీమణి.
బాబా భాస్కర్: తెలుగు వారికి ఎంతో సుపరిచితమైన బాబా భాస్కర్ ‘కుప్పతు రాజా’ అనే తమిళ సినిమాకి దర్శకత్వం వహించారు.
సుజి: ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి సుజి ‘మనసా తుళ్ళిపడకే’ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. 2014 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విద్యాసాగర్ రాజు: ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి విద్యాసాగర్ రాజు .. 2018లో వచ్చిన ‘రచయిత’, 2021 లో వచ్చిన ‘ఎఫ్ కుక్'(ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్) వంటి సినిమాలు డైరెక్ట్ చేశాడు.
పాల్: ‘దిల్ సే’ అనే తెలుగు సినిమాతో దర్శకుడిగా మారాడు.
అజయ్ సాయి మణికందన్: కొరియోగ్రాఫర్ అజయ్ సాయి మణికందన్ అలియాస్ ‘మథనం’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు.
శివాజీ: ‘తియ్యని కలవో’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు కొరియోగ్రాఫర్ శివాజీ
హరి ప్రసాద్: సిబిఐ, వైరస్ వంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు కొరియోగ్రాఫర్ హరి ప్రసాద్.
వీరాస్వామి: ఏప్రిల్ 28 ఏం జరిగింది.. అనే సినిమాని డైరెక్ట్ చేశారు కొరియోగ్రాఫర్ వీరాస్వామి.
భరత్ కొమ్మాలపాటి: మిస్టేక్, ఎస్5 : నో ఎగ్జిట్.. వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి.