కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుధేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిహార్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్‌తో సెప్టెంబర్‌లోనే ఏడడుగులు వేసినట్టు తెలుస్తుంది. ముంబైలోని ప్రభుదేవా నివాసంలో అత్యంత రహస్యంగా వివాహం చేసుకున్న ఈ కొత్త జంట ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుదేవాకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీడియాతో పంచుకున్నారు. అయితే ఈ విషయంపై ప్రభుదేవా మాత్రం స్పందించలేదు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెన్నముక సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రభుదేవా పిజియోథెరపీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చికిత్స అందించిన డాక్టర్‌తో ప్రభుదేవా ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్ అనంతరం వీరిద్దరూ పెళ్లిబంధంతో ఒకటయ్యారు.