HomeTelugu Big StoriesPrabhas డబుల్ డ్యూటీ: Fauji, Raja Saab సినిమాలకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్స్..!

Prabhas డబుల్ డ్యూటీ: Fauji, Raja Saab సినిమాలకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్స్..!

Prabhas’s Double Duty: Latest updates of Raja Saab!
Prabhas’s Double Duty: Latest updates of Raja Saab!

Prabhas Upcoming Movies:

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. అక్టోబర్ నుండి ఫౌజీ షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రభాస్, ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జైలు ఎపిసోడ్‌లను చిత్రీకరిస్తున్నారు. స్వాతంత్ర్యానికి ముందు కాలంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామాను హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం భారీ సెట్‌లను నిర్మించారు.

ఫౌజీ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రేమకథకు కీలకమైన ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతోంది. సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి మూడు సాంగ్స్ రికార్డు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ 2025 మొదటి హాఫ్ లో ముగియనున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో ప్రభాస్ మరొక సినిమా రాజా సాబ్ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం 2025 సమ్మర్ రిలీజ్‌ను లక్ష్యంగా చేసుకొని రూపొందుతోంది. రాజా సాబ్లో పూర్తి భిన్నమైన పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం తన అభిమానులను అలరించేలా రెండు విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నందుకు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫౌజీ పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకులను విభిన్న అనుభూతి ఇవ్వనుండగా.. రాజా సాబ్ ప్రేక్షకులను నవ్వుల తూఫానుగా ముంచెత్తనుంది.

ALSO READ: Pawan Kalyan కి బెదిరింపులు.. ఎవరు ఈ అజ్ఞాత వ్యక్తి?

Recent Articles English

Gallery

Recent Articles Telugu