Prabhas Hanu Raghavapudi movie:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యనే కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బాహుబలి తర్వాత వరుసగా డిజాస్టర్ లు అందుకున్న ప్రభాస్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. సలార్ తో కమర్షియల్ సక్సెస్ అందుకున్న ప్రభాస్.. కల్కి సినిమాతో రికార్డులు సృష్టించారు. ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభాస్ సీతా రామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో సందీప్ రెడ్డి గంగా దర్శకత్వంలో చేయాల్సిన స్పిరిట్ సినిమా ఉంది. కానీ ప్రభాస్ మాత్రం హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ ముందుగా మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 22 నుంచి మొదలు కాబోతోంది. 1940 మిలటరీ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా ఇది. పాకిస్థానీ హీరోయిన్ సజల్ అలీ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రేమ కథ కూడా కీలకంగా ఉంటుంది అని తెలుస్తోంది. ఒకప్పుడు డార్లింగ్ ప్రభాస్ చేసిన ప్రతి ప్రేమ కథ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. కానీ ఈ మధ్యకాలంలో ప్రభాస్ ప్రేమ కథలకు దూరంగా ఉంటున్నాడు.
రాధే శ్యామ్ సినిమా కూడా ప్రేమ కథలానే విడుదలయ్యి డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ మళ్ళీ ప్రేమ కథ అంటే వర్క్ అవుట్ అవుతుందా అని కూడా అనుమానాలు మొదలయ్యాయి. అయితే వింటెజ్ ప్రభాస్ ని మళ్ళీ చూపించగలిగితే మాత్రం కచ్చితంగా సినిమా వర్క్ అవుట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు.
పైగా ప్రభాస్ ఇప్పటిదాకా సైనికుడి పాత్రలో కూడా కనిపించకపోవడం సినిమాకి బాగానే ప్లస్ అవ్వచ్చు. మళ్ళీ ప్రేమ కథ లో ప్రభాస్ ను చూడడానికి ఫ్యాన్స్ కూడా రెడీ గానే ఉన్నారు. మరి హను రాఘవపూడి ఈ అవకాశాన్ని ఎంతవరకు వినియోగించుకుంటారో చూడాలి.