పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాగా.. టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో కలిసి రాజా డీలక్స్ కూడా చేస్తున్నాడు. సలార్ రెండు పార్టులుగా రానుంది. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న టైమ్‌లో ప్రభాస్ షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వనున్నాడు అనే వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ప్రభాస్ మోకాలి ఆపరేషన్ కోసం యూరప్ వెళ్లాడని తెలిసిందే. దీనికోసం ప్రభాస్ యూరప్‌లో 1 -2 నెలలు ఉండబోతున్నాడట. భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత 6 నుంచి 7 వారాలు విశ్రాంతి తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నట్టు ఫిలింనగర్ సర్కిల్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ లెక్కన ప్రభాస్ వచ్చే 3-4 నెలలపాటు సినిమా షూటింగ్‌లేమీ ఉండవు అని టాక్.