బాహుబలి సినిమాతో నేషనల్ హీరో అయిపోయాడు ప్రభాస్. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని భారీ పోస్ట్ ప్రమోషన్ ఈవెంట్స్ ను కావాలని ప్రభాస్ తప్పించుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపు 5 సంవత్సరాలు పైగా ఈ సినిమా కోసం కష్టపడ్డ ప్రభాస్ ఇప్పుడు ఈ సినిమా సక్సస్ ను ఆనందిస్తూ ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో తన సన్నిహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రాజమౌళి లండన్ లో జరిగిన బాహుబలి2 ప్రత్యేక ప్రదర్శనకు ప్రభాస్ ను లండన్ రమ్మని
పిలిచారు. దానికి మన హీరో హాజరు కాలేదు.
‘బాహుబలి 2’ ఘన విజయానికి కీలక పాత్ర వహించిన కరణ్ జోహార్ ముంబాయిలో ఏర్పాటు చేయబోతున్న ఒక భారీ పార్టీకి కూడ ప్రభాస్ రావడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. కరణ్ జోహార్ ప్రత్యేకంగా రెండు రోజులు సమయం కేటాయించమని అడిగినా తనకు పార్టీల మీద ఆసక్తి లేదని తిరస్కరిస్తున్నాడట. ప్రభాస్ ఎందుకు ఇలా చేస్తున్నాడో.. అసలు తన ఆంతర్యం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు.