HomeTelugu TrendingPrabhas సినిమాకి డ్రగ్ మాఫియాకి సంబంధం ఏంటి?

Prabhas సినిమాకి డ్రగ్ మాఫియాకి సంబంధం ఏంటి?

Prabhas to have a drug mafia backdrop for Spirit
Prabhas to have a drug mafia backdrop for Spirit

Prabhas Spirit Update:

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ చివరికి పూర్తి కానుంది.

దీని తర్వాత, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా షూటింగ్ లో ప్రభాస్ డిసెంబర్‌లో జాయిన్ కానున్నారు. ఇది కాకుండా.. ప్రభాస్ ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ కి కూడా సైన్ చేశారు. ఈ సినిమాకి సంధీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా Spirit అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు.

స్పిరిట్‌ సినిమాకి స్క్రిప్ట్ పూర్తి చేయడానికి సంధీప్ రెడ్డి వంగా కొంత సమయం కోరగా, ప్రభాస్ కూడా తన ప్రస్తుత ప్రాజెక్ట్స్ పూర్తి చేసేందుకు సమయం అడిగారు. స్పిరిట్‌ లో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం, Spirit సినిమాలో డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేసే పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నటించనున్నారు అని టాక్. డ్రగ్ మాఫియా దేశానికి ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా యువతకు డ్రగ్స్ అలవాటు అవుతుండటంతో ఈ సమస్య తీవ్రత పెరుగుతోంది. ముంబైలోని డ్రగ్ మాఫియాపై యుద్ధం చేసే పోలీస్ ఆఫీసర్‌ గా ప్రభాస్ పాత్ర ఉంటుందని సమాచారం.

ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మొదటి క్వార్టర్‌లో ప్రారంభమవుతుంది. స్పిరిట్‌ చిత్రాన్ని టీ సిరీస్, శ్రీ భద్రకాళి పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. స్పిరిట్ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read More: OTT releases: బాలు గాని టాకీస్ నుండి అలనాటి రామచంద్రుడు దాకా.. ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu