Prabhas to Anushka: మూవీ ఇండస్ట్రీలో బ్యాచిల్లర్కు కొదవ లేదు. ఈ మథ్యకాలంలో.. ఏజ్ బార్ అవుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు 20 ఏళ్ళ లోపు పెళ్ళి చేసేవారు.. అది కాస్తా ఆతరువాత 30 కి చేరింది. ఇప్పుడు 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదు. 40 ఏళ్లు దాటినా.. పెళ్లి ఊసెత్తని తారలు ఎంతో మంది ఉన్నారు. ఈ విషయంలో హీరోలకు పోటీ ఇస్తున్నారు హీరోయిన్లు.
గతంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే సల్మాన్ ఖాన్ పేరు మాత్రమే వినిపించేది. 60 ఏళ్లు వస్తున్నాయి సల్మాన్ కు.. కాని ఇంత వరకూ పెళ్ళి చేసకోలేదు. ఇక చేసుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. అయితే ఇఫ్పుడు ఈ లిస్ట్‌లో చాలామంది చేరిపోయారు. అందులో మన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉంటుంది. డార్లింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా.. అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. 44 ఏళ్ళు వచ్చినా ప్రభాస్ పెళ్లి ఊసు ఎత్తడం లేదు. ప్రస్తుతం 6 పాన్ ఇండియా సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి అవి కంప్లీట్ అయ్యే వరకూ ప్రభాస్ కు 50 ఏళ్ళు దాటడం ఖాయం.. ఇంక ప్రభాస్ పెళ్ళి గురించి ఎప్పుడు ఆలోచిస్తాడో!
నాలుగు పదులు దాటినా పెళ్లి గురించి ఆలోచించని తారల్లో హీరోయిన్లు కూడా ఉన్నారు. అందులో మొదట చెప్పుకోవల్సింది అనుష్క గురించే. స్టార్ హీరోయిన్ గా వెలిగిన అనుష్క శెట్టి.. అరుంధతి సినిమాతో తరాలు పాటు గుర్తుంచుకునేలా చేసింది. ఇక ఆమె వయస్సు 42 అయినా పెళ్ళి గురించి క్లారిటీ ఇవ్వడంలేదు. రూమర్లయితే చాలా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ తో ప్రేమలో ఉంది. రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఫారెన్ లో ఇల్లు కూడా కొన్నారు అని అన్నారు. కాని వీటిపై క్లారిటీ లేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం గ్రాఫిక్స్ లో.. వీరి పెళ్లి కూడా చేశారు.
ఇండస్ట్రీలో మరో మోస్ట్ బ్యాచిలర్ హీరో విశాల్. తమిళంలో స్టార్ హీరోగా మారిన ఈ తెలుగు కుర్రాడు.. 46 ఏళ్ళు వచ్చినా..ఇంకా పెళ్ళి పీటలు ఎక్కలేదు. అయితే ఓ రెండు సార్లు ఎంగేజ్మెంట్ వరకూ వెళ్ళాడు. ఓ లవ్ ఫేల్యూర్స్ ను ఫేస్ చేశాడు. ఇలా ముచ్చటగా మూడు సార్లు పెళ్లి ఆగిపోయి.. ప్రస్తుతం బ్యాచిలర్ లైఫ్ నుఎంజాయ్ చేస్తున్నాడు. పెళ్ళెప్పుడు బాబు అని అడిగితే.. ప్రభాస్ చేసుకున్నాక చేసుకుంటాను అంటున్నాడు. కోలీవుడ్ సమాచారం ప్రకారం.. అక్కడ నిర్మిస్తున్ననడిగర్ సంఘ భవన నిర్మాణం తరువాత విశాల్ పెళ్లి చేసుకుంటాడట.
హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్ త్రిష. నాలుగుపదుల వయస్సుల దాటినా.. కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ.. అందంతో అద్భుతం చేస్తోంది త్రిష . గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న త్రిష.. ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. గతంలో ఓ బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్న త్రిష.. సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. 40 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు.
హీరో తరుణ్. గతంలో.. లవర్ బాయ్ ఇమేజ్ తో దూసుకుపోయిన ఈ హీరో.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. అవకాశాలు లేక.. రాక.. టాలీవుడ్ ను వదిలి ప్రస్తుతం తన ఫ్యామిలీ బిజినెస్ లు చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఈవెంట్ల్లో కనిపిస్తుంటాడు. ఈ హీరో కూడా ఇంత వరకూ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
మెస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్ నగ్మ గురించి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. సౌత్.. నార్త్ హీరోలతో నటించి మెప్పించింది. కాని ఈ ముద్దు గుమ్మ 50 ఏళ్లు దాటినా పెళ్ళి చేసుకోలేదు.
52 ఏళ్ళు వచ్చినా పెళ్ళి మాత్రం పెళ్లి ఊసెత్తని హీరోయిన్‌ల్లో టబు ఒకరు. 90స్ లో వెండితెరను ఒక ఊపుఊపేసిన ఈ తార.. ప్రస్తుతం గ్లామర్ కలిగిన క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏజ్ బార్ అవుతున్నా పెళ్లిళ్లు చేసుకోని తారలు చాలా మంది ఉన్నారు. అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, గ్రేట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఆర్ నారాయణ మూర్తి.. ఒకప్పటి అందాల తార, క్లాసికల్ డాన్సర్ శోభన కూడా పెళ్ళి చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతున్నారు.