
Prabhas Brahma Rakshas:
‘హను-మాన్’ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. పాన్-ఇండియా రేంజ్‌లో కథలు సిద్ధం చేసుకుంటున్న ఆయన, బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్‌కు ‘బ్రహ్మ రాక్షస’ స్క్రిప్ట్ వినిపించారు. అయితే, అనుకోని కారణాల వల్ల రణవీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.
ఈ పరిస్థితిలో, టాలీవుడ్ రిబెల్ స్టార్ ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేసే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సమాచారం ప్రకారం, ప్రభాస్ ‘బ్రహ్మ రాక్షస’ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా గురువారం జరగనుందట. అయితే, అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ఇక, ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందనే విషయంలో స్పష్టత లేదు. ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి 2898 ఏ.డి సీక్వెల్’ వంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో ‘బ్రహ్మ రాక్షస’ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో చూడాలి.
అలాగే, ప్రశాంత్ వర్మ కూడా తన చేతిలో పలు ప్రాజెక్ట్‌లతో ఉన్నాడు. ముఖ్యంగా, నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ, రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్‌లకు ఫోకస్ పెట్టాడు. ఈ నేపథ్యంలో, ‘బ్రహ్మ రాక్షస’ ఎప్పుడు ఫుల్ స్కేల్ ప్రొడక్షన్‌లోకి వెళ్తుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ హారర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ALSO READ: Here’s how Boney Kapoor convinced Sridevi with his one-sided love