యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ ‘సాహో’ చిత్రబృందంతో కలిసి కేబుల్ రైడ్‌ను ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్ ఆస్ట్రియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్, శ్రద్ధతో ఇతర సిబ్బంది కేబుల్ రైడ్ ఎక్కారు. చిత్రబృందంతో కలిసి ప్రభాస్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను శ్రద్ధా కపూర్ హెయిర్ స్టయిలిస్ట్ నికితా మేనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఈ షెడ్యూల్‌తో ‘సాహో’ సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తారని తెలుస్తోంది. సుజీత్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు విశేషమైన స్పందన లభించింది. అద్భుతమైన స్టంట్స్, డైలాగ్స్, యాక్షన్ ఘట్టాలతో టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆగస్టు 15న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.