ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. సలార్ డేట్ ఫిక్స్

 

రెబల్ స్టార్ ప్రభాస్ తాజా మూవీ ‘సలార్‌’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌‌ టైనర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది.

సలార్ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా పృథ్వీరాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో విడుదల తేదీని వాయిదా వేశారు. ఇప్పుడు సలార్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసింది చిత్రబృందం.

క్రిస్మస్‌ కానుకగా సలార్‌‌ను డిసెంబర్‌‌ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించింది. సలార్ మూవీ రిలీజ్ డేట్‌తో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను వదిలారు. కట్ బనియన్ లో ఉన్న ప్రభాస్ ఒంటిపై రక్తం, చేతిలో కత్తితో నిలుచున్నాడు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్ సమయంలోనే షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వస్తున్న ‘డుంకీ’రిలీజ్ కానుంది. పఠాన్, జవాన్‌ చిత్రాలతో భారీ విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న షారుక్‌తో ప్రభాస్ ఢీకొట్టనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu