ప్రభాస్ సలార్ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ సినిమా అంటే నార్త్‌లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. నార్త్ మార్కెట్ మీద ప్రభాస్‌కు మంచి గ్రిప్ వచ్చింది. కానీ బాహుబలి 2 తరువాత మళ్లీ ఆ రేంజ్‌లో సక్సెస్ చూడలేకపోయాడు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్‌లు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నార్త్ మార్కెట్‌లో ప్రభాస్ సత్తా చాటే చిత్రంగా సలార్ నిలుస్తుందని అంతా అనుకున్నారు.
ప్రభాస్ సలార్ సైతం ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చింది. కేజీయఫ్ తరువాత ప్రశాంత్ నీల్ ఈ సలార్ సినిమాను తెరకెక్కించడంతో సాధారణంగానే అంచనాలు పెరిగాయి. సలార్ అనేది కొత్త కథేమీ కాదని అది ఉగ్రం సినిమాకు రీమేక్ అని అంతా అనుకున్నారు. అంతా అనుకున్నట్టుగానే సలార్ అనేది ఉగ్రం అప్డేటెడ్ వర్షన్. దీంతో మొదటి రోజు నుంచే సలార్ మీద విమర్శలు మొదలయ్యాయి.
తెలుగులో మాత్రం సలార్‌కు మంచి రివ్యూలే పడ్డాయి. కానీ సౌత్‌లో సలార్‌కు అంతగా డిమాండ్ లేకపోయింది. ఇక నార్త్‌లోనూ సలార్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సలార్ కలెక్షన్లు దెబ్బ కొట్టేసినట్టు అయింది. కనీసం నార్త్ ఆడియెన్స్‌కి సలార్ కనెక్ట్ అయినా కలెక్షన్లు అదిరిపోయేవి. దీంతో ఇండియన్ మార్కెట్లో సలార్ వండర్లు క్రియేట్ చేయలేకపోయింది. అలా అని ఓవర్సీస్‌లోనూ వండర్లు చేయలేదు. కేవలం తెలుగు వర్షన్ మాత్రం అక్కడే క్లిక్ అయింది. మిగతా భాషల్లో సలార్‌ను ఎవ్వరూ పట్టించుకోలేదు.
షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్‌లతో అవలలీలగా వెయ్యి కోట్లు కొట్టాడు. ప్రభాస్ సలార్ కూడా ఆ క్లబ్బులో జాయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. అధికారిక లెక్కలు, వారు వేసిన పోస్టర్ల ప్రకారం సలార్ ఏడు వందల కోట్ల క్లబ్బులో కూడా జాయిన్ అవ్వలేదు. అంటే మహా అంటే ఈ చిత్రానికి మూడొందల కోట్ల షేర్ కూడా వచ్చి ఉండకపోవచ్చు. ఇక ఇప్పుడు సలార్ ఇరవై కోట్ల నష్టాలను తెచ్చిందని కొందరు.. డెబ్బై కోట్ల నష్టాన్ని తీసుకొచ్చిందని మరి కొందరు లెక్కల్ని విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా సలార్ మాత్రం లాభాలను కాకుండా నష్టాలను తెచ్చి పెట్టిందని మాత్రం అంటున్నారు.