HomeTelugu Trendingఅఫీషియల్: స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌ పాత్ర ఇదే

అఫీషియల్: స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌ పాత్ర ఇదే

Prabhas role revealed in sp
పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన హీరోగా నటించిప రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆదిపురుష్ షూటింగ్ ని కూడా పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తరువాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. కేవలం టైటిల్ టోన్ ఒక స్థాయిలో అంచనాలను పెంచేసిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది.

ఆదిపురుష్ నిర్మాత భూషణ్ కుమార్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్పిరిట్ లో ప్రభాస్ పాత్రని రివీల్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ టిపికల్ పోలీస్ కాప్ గా కనిపించబోతున్నాడంట. ఇప్పటివరకు ప్రభాస్ పోలీస్ గా ఒక్కసారి కూడా కనిపించలేదు. ఇందులోనే మొట్ట మొదటిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని చెప్పాంతో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన హీరో తమ డ్రీమ్ ని నిజం చేస్తున్నాడని, ప్రభాస్ ని ఎప్పటి నుంచో పోలీస్ పాత్రలో చూడాలనుకొంటున్నామని అది స్పిరిట్ తో తీరిపోతుందని అంటున్నారు. మరి ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu