కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన తాజా చిత్రం ‘కాంతారా’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని హోంబలస్త్ర ఫిల్మ్స్ పతాకంపై కిరాంగదుర్ నిర్మించారు. సెప్టెంబర్30న కన్నడలో విడుదలైన ఈ సినిమాను అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. తెలుగు థ్రియేటికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని ‘గీతా ఫిల్మ్ డిస్ట్రీబ్యూషన్’ ద్వారా నేడు (అక్టోబర్15) విడుదల చేశారు.
ఈ సినిమాపై స్టార్ హీరోలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే హీరో ధనుష్, రానా సోషల్ మీడియా వేదికగా ‘కాంతారా’ పై ప్రశంసలు చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కాంతారా’ సినిమాని విక్షించారు. ఈ సినిమాపై తన రివ్యూని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.”కాంతారా ఓ అద్భతమైన సినిమా. నేనే ఇప్పటికి రెండు సార్లు చూశాను. మంచి కాన్సెప్ట్‌తో అదిరిపోయే క్లైమాక్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాని థియేటర్స్‌లో తప్పకుండా చూడాలి” అంటూ సినిమా పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.