HomeTelugu TrendingRaja Saab షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తున్నారా?

Raja Saab షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తున్నారా?

Prabhas Raja Saab to wrap up soon?
Prabhas Raja Saab to wrap up soon?

Raja Saab shooting update:

ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తీసుకుంటున్న రాజా సాబ్ చిత్ర షూట్ లో పాల్గొంటున్నారు. చాలా కాలం క్రితం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. అయితే ప్రభాస్ ఇప్పటికే సలార్, కల్కి 2898 AD చిత్రాల షూట్‌లు పూర్తి చేయగా.. ఆ సినిమాలు ప్రణాళిక ప్రకారం విడుదలయ్యాయి.

ఇప్పుడు, ప్రభాస్ రాజా సాబ్ చిత్ర షూట్‌ని త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, నవంబర్ చివరికల్లా ఈ చిత్రానికి సంబంధించిన షూట్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రత్యేకంగా డేట్లు కేటాయించారట. దర్శకుడు మారుతిని నవంబర్ చివరికల్లా షూటింగ్ పార్ట్ ముగించమని ఆర్డర్ కూడా వేశారట.

మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఈ హారర్ రొమాంటిక్ కామెడీ సినిమాలో ప్రధాన కథానాయికలు. ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో జరిగింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజా సాబ్ టీజర్, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 29న విడుదల చేయనున్నారు. ప్రభాస్ ఈ ఏడాది హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే మరో చిత్రంలో నటించేందుకు సిద్దమవుతున్నారు. అలాగే, వచ్చే ఏడాది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రంలో కూడా ప్రభాస్ నటించనున్నారు.

Read More: RC16: రామ్ చరణ్ తో సినిమా కోసం రైటర్స్ కి ఇస్తున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu