ఆవారా, ఊపిరి వంటి చిత్రాలతో కార్తీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన
హీరోగా నటిస్తోన్న ‘కాష్మోరా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ బాషల్లో
విడుదల కానున్న ఈ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహించారు. నయనతారా, శ్రీదివ్య హీరోయిన్లుగా
నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కార్తీ సుమారుగా రెండేళ్ల పాటు కష్టపడ్డారు. ఇదే విషయమై
ఆయనను ప్రశ్నించగా.. తను ప్రభాస్ ను స్ఫూర్తిగా తీసుకున్నానని అన్నారు. బాహుబలి
సినిమా కోసం ప్రభాస్ పడిన కష్టం ముందు నేను పడిన కష్టం ఎంత..? అన్నారు. అలానే
కాష్మోరా సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును తీసుకొస్తుందని చెప్పారు. ఫాంటసీ, హారర్,
థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కూడిన హిస్టారికల్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి
అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఆ అంచనాలు కాస్త మరింత పెరిగాయి.