Kalki 2898AD: పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898’. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది.
ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నట్లు మూవీయూనిట్ వెల్లడించింది. కాశీ భవిష్యత్తు వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం అంటూ మేకర్స్ రాసుకోచ్చారు.
ఇక పోస్టర్ లో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడు. ఫ్యుచర్ స్టైల్ గాగుల్స్, స్లీవ్ లెస్ డ్రెస్ .. కండలు తిరిగిన దేహంపై టాటూ, పోనీటైల్ హెయిర్.. ఓ రేంజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇటీవలే మూవీ టీమ్ ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటలీలో ఆట-పాట అంటూ.. అప్డేట్ ఇచ్చారు. ఈ ఫోటోలో దీశా పటనీ కనిపించింది. వీరిపై ఓ రొమాంటిక్ సాంగ్‌ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీపికా పదుకోన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మే 09న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన దీని గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.