దాదాపుగా ఐదేళ్లుగా బాహుబలి సినిమా కోసం కష్టపడ్డ ప్రభాస్ ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలోనే తన తదుపరి సినిమా ‘సాహో’ షూటింగ్ లో పాల్గొనున్నాడు. అయితే బాహుబలి కోసం మీసాలు, పొడవాటి జుట్టు, గెడ్డం పెంచిన ప్రభాస్ ఇప్పుడు అభిమానులకు తన కొత్త లుక్ తో షాక్ ఇచ్చాడు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ సరికొత్త లుక్ చూసి అసలు అభిమానులకు ఎలా రియాక్ట్ అవ్వాలో.. కూడా తెలియడం లేదు. మీసం తీసేసి, నీట్ గా ట్రిమ్ చేసుకొని ఓ కొత్త గెటప్ లో ప్రత్యక్షమయ్యాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హకీం అలీ ప్రభాస్ఫోటోను షేర్ చేశారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఈ గెటప్ తన కొత్త సినిమా ‘సాహో’ కోసమే అనే ప్రచారం జరుగుతోంది. సుధీర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సాహో’ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించనున్నారు. ఎప్పుడూ క్లీన్ షేవ్ తో కనిపించని ప్రభాస్ ను ఒక్కసారిగా ఆ చూసి అభిమానులు ఒకింత షాక్ కు గురయ్యారు. మరి సినిమా మొత్తం ఈ లుక్ తో కనిపిస్తాడా..? లేక మరో కొత్త లుక్ ఏమైనా.. ట్రై చేస్తాడేమో చూడాలి!
Attachments