టాలీవుడ్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘ ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఇది ఎమోషన్స్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
‘కేజీఎఫ్’తో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తోగానీ .. మహేశ్ తోగాని సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ ఆ ఇద్దరి నెక్స్ట్ మూవీ వేరే డైరెక్టర్‌లతో సెట్ అయింది. దాంతో ప్రశాంత్ నీల్ .. ‘కేజీఎఫ్ 2’ తరువాత సినిమాను ప్రభాస్ తో చేయాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు.
ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ వారి అడ్వాన్స్ ప్రశాంత్ నీల్ దగ్గర ఉందట. తమ బ్యానర్లో వాళ్లు ప్రభాస్ సినిమాను సెట్ చేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఇది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు.