యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తాజా చిత్రం రాధేశ్యామ్ ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్ర చేయనున్నాడు. అయితే లక్ష్మణుడు ఎవరనేది ఇంకా తేలలేదు. ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాప్ లక్ష్మణుడి పాత్ర
చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్‌లోని అనేకమంది యంగ్ స్టార్స్ పేర్లు వినిపించాయి. అర్జున్ కపూర్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో లక్ష్మణుడి పాత్ర ఎవరు చేస్తారా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.