HomeTelugu Trendingవింటేజ్‌ ప్రభాస్‌ వచ్చేస్తున్నాడు.. గెట్‌ రెడీ

వింటేజ్‌ ప్రభాస్‌ వచ్చేస్తున్నాడు.. గెట్‌ రెడీ

Prabhas Maruti Movie Updatపాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే సలార్ తో భారీ హిట్ కొట్టేశాడు. నాగ్ అశ్విన్‌ లో సైన్స్ ఫిక్షన్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీలో నటిస్తున్నాడు. మే9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్‍ కు డేట్ ను మూవీ టీమ్ ప్రకటించింది.

ప్రభాస్- మారుతి కాంబినేషన్‍లో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‍ ను జనవరి 15వ తేదీ ఉదయం 7 గంటల 8 నిమిషాలకు రివీల్ చేయనున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్‍ ను ప్రకటించినున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగ రోజే అదిరిపోయే గిఫ్ట్ వచ్చేయనుంది. ఉదయించే సూర్యుడు, అరుస్తున్న కోడిపుంజుతో టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ ను నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Prabhas Maruti Movie1
“సంక్రాంతి రోజు.. సూర్యోదయంతో పాటు.. రెబల్ స్టార్ కూడా త్వరగా ఉదయించి మీ అందరికీ డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ జనవరి 15వ తేదీ ఉదయం 7 గంటల 8 నిమిషాలకు ఆవిష్కరించనున్నాం. ప్రభాస్ పొంగల్ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండి” అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. వింటేజ్ డార్లింగ్ ప్రభాస్ మీ ముందుకు వచ్చేస్తున్నారని చెప్పింది.

అయితే ఈ మూవీ హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్నట్లు టాక్‌. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్.. ఫుల్ ఫన్ ఉండే క్యారెక్టర్ చేస్తున్నారని సమాచారం. డార్లింగ్ సినిమా లాంటి క్యారెక్టరైజేషన్ ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో వింటేజ్ ప్రభాస్‍ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఫ్యాన్స్ తెలిపారు. ఈ చిత్రానికి రాజా డీలక్స్ గా టైటిల్ ఫిక్స్‌ చేసిన్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టైటిల్‌ ఛేంజ్‌ చేసిన్నట్లు తెలుస్తుంది.

ప్రభాస్‌ ఇమేజ్‌ని దృష్టలో పెట్టుకుని టైటిల్ ను రాజా సాబ్ గా మారుస్తున్నారట. మొదట ఈ మూవీని తెలుగులో మాత్రమే విడుదల చేయాలనుకున్నా.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తారట. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనేక సర్ ప్రైజ్ లు ఉండనున్నాయట.

పాన్‌ ఇండియా హీరోగా మారిన తరువాత ప్రభాస్‌ సినిమాలు అన్నీ కమర్షియల్‌గానే వస్తున్నాయి. అయితే ఈ సినిమాతో వింటేజ్‌ ప్రభాస్‌ని చూడడం, అదీ కూడా కామెడీ మూవీ కావడంతో ప్రభాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu