ప్రభాస్ మూవీ ”రాధేశ్యామ్” టీమ్ విదేశాలకు పయనమైంది. రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్‌స్టోరీతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కొంతవరకు విదేశాల్లో చేశారు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోనే భారీ సెట్టింగులతో మరికొంత షూటింగ్ పార్ట్ పూర్తిచేశారు. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు చిత్ర యూనిట్ మళ్లీ ఇటలీకి పయనమైంది. 15 రోజుల పాటు ఇటలీలో ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య సన్నివేశాలను మరియు ఓ పాటను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి చిత్రబృందం హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.