రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను స్వీకరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడవ దశ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం ఉన్నతమైన విలువలతో కూడుకున్నదని అన్నారు. దీనిలో భాగంగా వారు దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్యక్రమం నన్ను ఆకర్షించింది. అందుకే వారి స్పూర్తితో వారు ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నాను.” సంతోష్ కుమార్ గారి మహోన్నతమైన ఆశయం ముందుకు పోవాలంటే.. మనమంతా వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజం బావుంటుంది. ఈ కార్యక్రమంలో నా అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దీనికి కొనసాగింపుగా.. రాంచరణ్, రానా, శ్రద్ధా కపూర్‌లను “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు నామినేట్ చేస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు.
#Prabhas accepts the #greenindiachallenge and planted saplings along with TRS MP@MPsantoshtrs @HarithaHaram 🌿🌱♥️ pic.twitter.com/JfQnBUGINW
— Prabhas (@PrabhasRaju) June 11, 2020