HomeTelugu Trendingప్రభాస్ వదిలిన 'రొమాంటిక్' ట్రైలర్

ప్రభాస్ వదిలిన ‘రొమాంటిక్’ ట్రైలర్

Romantic Trailer
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ సినిమాలో ఆకాష్ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు అనిల్ పాడుడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు చిత్రబృందం. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను హీరో ప్రభాస్ విడుదల చేశారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాను పూరి కాన్సెప్ట్‌ పతాకంపై పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు.

Romantic Trailer2

ట్రైలర్‌ చూస్తుంటే టైటిల్‌కు తగ్గట్టుగా ఈ సినిమాలో రొమాంటిక్ అంశాలు ఫుల్‌గా నింపేసినట్లు అనిపిస్తోంది. యువతను బాగా ఆకట్టుకునేలా ఉంది. హీరో ఆకాశ్, కేతిక శర్మ రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చినట్లు తెలుస్తోంది. లవ్, క్రైమ్ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కినట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు మరియు టీజర్ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu