HomeTelugu TrendingRaja Saab: బ్రేకులు వద్దు అని ప్రభాస్ డిసైడ్ అయిపోయారా?

Raja Saab: బ్రేకులు వద్దు అని ప్రభాస్ డిసైడ్ అయిపోయారా?

Raja Saab: Crazy details of the Prabhas starrer
Prabhas in plans to wrap up Raja Saab soon

Raja Saab Shooting Update:

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో వరుసగా సినిమాలో చేయడం మాత్రమే కాక చేతినిండా బోలెడు సినిమాలు ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఒక సినిమా తర్వాత మరొక సినిమా ఎక్కువ గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తూ వరుసగా సినిమాలను అందిస్తున్నారు ప్రభాస్. సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా అయినా ఇవ్వాలి అన్న టార్గెట్ తో ముందుకు దూసుకు వెళ్తున్నారు.

నిన్న మొన్నటిదాకా సమయం దొరికినప్పుడు అప్పుడు కాస్త ఇప్పుడు కాస్త అంటూ రాజా షాప్ సినిమా షూటింగ్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హారర్ కామెడీల మీద ప్రేక్షకులకి బాగా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఈ మధ్యకాలంలో ఈ జోనర్ లో మంచి సినిమా రాలేదు. కాబట్టి ఈ సమయంలోనే ఒక మంచి హారర్ కామెడీ ఇస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు.

మరోవైపు ప్రభాస్ ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేయాల్సి ఉంది. ఇక కల్కి సెకండ్ పార్ట్ కోసం కూడా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలు ముందుగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నవంబర్ పూర్తయ్యే లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసేసి నెక్స్ట్ సినిమాల మీద దృష్టి పెట్టాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారట.

ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈ సినిమా కోసం బ్రేక్స్ లేకుండా నాన్ స్టాప్ గా పని చేయడానికి రెడీ అవుతున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది ఒక మారుమూల అడవిలో మధ్యలో ఉండే ఒక పాడుబడిపోయిన ఇంటి సెట్ ను ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో నిర్మించారు.

సెంటిమెంట్ అయినా యాక్షన్ అయినా తన మార్క్ ఎంటర్టైర్మెంట్ ఉండేలాగా చూసుకోవడానికి మారుతి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఇక ప్రభాస్ వంటి స్టార్ హీరోతో సినిమా కాబట్టి మారుతి ఈ సినిమాతో కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తారని చెప్పుకోవచ్చు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల కి సిద్ధం అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu