HomeTelugu Big Storiesప్రభాస్ హీరోయిన్ తో Nani కాంబో సెట్! ఇంకో సర్‌ప్రైజ్ ఏంటంటే

ప్రభాస్ హీరోయిన్ తో Nani కాంబో సెట్! ఇంకో సర్‌ప్రైజ్ ఏంటంటే

Prabhas heroine returns to Telugu cinema with Nani's political thriller?
Prabhas heroine returns to Telugu cinema with Nani’s political thriller?

Nani Odela 2:

నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ కొట్టిన సినిమా దసరా. ఈ సినిమాతో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరొక్కసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో NaniOdela2 అనే తాత్కాలిక పేరుతో సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా, మొదట జాన్వీ కపూర్ పేరు హీరోయిన్ గా వినిపించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన శ్రద్ధా కపూర్ పేరు వినిపిస్తోంది. శ్రద్ధా ఇటీవల స్త్రీ 2 లో నటించి మరో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తెలుగులో ఆమెకి ఇది రెండో సినిమా అవుతుంది.

మొదటిసారి ప్రభాస్ సరసన సాహో సినిమాలో కనిపించిన శ్రద్ధ.. ఇప్పుడు నాని సరసన నటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. సినిమా కథ ప్రధానంగా రాజకీయాల నేపథ్యంలో సాగనుందని వార్తలు వచ్చాయి.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశముంది. శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి జోడీ కట్టడం అభిమానులను ఆసక్తిగా మారుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌కు దసరా తరవాత మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని దసరా నిర్మించిన సుధాకర్ చెరుకూరి స్వీయ బ్యానర్ ఎస్ ఎల్ వీ సినిమాస్ పై నిర్మిస్తున్నారు

Read More: Tollywood లో ఒకటి తక్కువ అయింది.. అదేంటంటే

Recent Articles English

Gallery

Recent Articles Telugu