Prabhas heroine suports Allu Arjun:
పుష్ప 2 ప్రదర్శన సమయంలో సంధ్య థియేటర్‌లో జరిగిన సంఘటనపై దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ కొనసాగుతోంది. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను నిందితుడిగా పేర్కొనడం, ఆయన అరెస్టు వివాదాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చింది.
ఇటువంటి సమయంలో, Prabhas బుజ్జిగాడు సినిమా నటి సంజన గల్రానీ అల్లు అర్జున్‌ను మద్దతు తెలుపుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. పలు టీవీ చానెల్స్ నిర్వహించిన డిబేట్స్‌లో పాల్గొంటూ, ఆమె స్పష్టమైన, బలమైన వాదనలతో అల్లు అర్జున్‌ను సమర్థిస్తున్నారు.
View this post on Instagram
ఆమె మాట్లాడుతూ, “అల్లు అర్జున్‌ను తప్పుగా నిందిస్తున్నారు. ఆయనపై అనవసరంగా కేసు మోపారు. నిజానికి, ఆయన బాధ్యతగల వ్యక్తి,” అని స్పష్టం చేశారు. సంజన గల్రానీ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ.. గతంలో తాను కూడా వ్యవస్థ ద్వారా న్యాయం పొందలేకపోయానని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న అల్లు అర్జున్ ను సమర్థించడం తన కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు.
అంతేకాదు, సంజన మాట్లాడుతూ, “తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నటులపై అభిమానులు చూపే ప్రేమ గొప్పది. అల్లు అర్జున్ ఎప్పుడూ ఈ ప్రాంత ప్రేక్షకులకు దగ్గరే ఉంటారు. ఆయనపై ఇలాంటి ఆరోపణలు మంచిది కాదు” అని చెప్పారు.