ఇప్పటికే రామయాణంపై చాలా సినిమాలు వచ్చాయి. అనేక భాషాల్లో ఈ మహాగాథను సినిమాలా రూపంలో చూపించారు. అయితే మరోసారి ‘రామాయణ’ మహాగాథను మరోసారి వెండితెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. అయితే ఇప్పటికే ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో హృతిక్ రోషన్ ను .. సీతాదేవిగా దీపికా పదుకొనేను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.
రావణుడి పాత్ర కోసం కొంతకాలంగా అన్వేషణ జరుగుతోంది. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే ఇప్పుడు రావణుడిగా ప్రభాస్‌ని తీసుకుంటే ఎలా ఉంటుందోనని ఆలోచనలో ఉంది సినిమా టీం. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ప్రభాస్ సాహో సినిమాతో తనకున్న క్రేజ్ మరోసారి నిరూపించుకున్నారు. దీంతో ‘రామాయణ’లో రావణుడి పాత్ర కోసం ప్రభాస్‌ను సంప్రదించే పనిలో పడ్డారు చిత్రయూనిట్.
అత్యంత భారీ సాంకేతికతో తెరకెక్కుతోన్నఈ సినిమాను మధు మంతెన, నమిత్ మల్హోత్రా అనే మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి రామాయణం సినిమాను 3డిలో నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు అల్లు అరవింద్. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి 3డి కెమెరాలు తెప్పించబోతున్నారు. 2021లో తొలి భాగం విడుదల కానుంది. ఈ సినిమాను దంగల్ ఫేమ్ నితిష్ తివారీ, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యావర్‌తో డైరెక్ట్ చేయనున్నారు.