Prabhas remuneration for Raja Saab:
ఈ రోజు అంటే అక్టోబర్ 23, 2024 న టాలివుడ్ పేరుని కొన్ని మెట్లు పైకి ఎక్కించిన స్టార్ నటుడు ప్రభాస్ తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. “రెబెల్ స్టార్”గా ఫ్యాన్స్ పిలుచుకునే ప్రభాస్, బాహుబలి సిరీస్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అభిమానులు ప్రభాస్ పుట్టినరోజును గ్రాండ్‌గా జరుపుకుంటూ, సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం The Raja Saab కోసం బిజీగా ఉన్నారు. ఇది మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్-కామెడీ సినిమా. ఈ చిత్రానికి దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ ఖర్చు అవుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. జనవరి 2025లో విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్ పొడవాటి జుట్టు, గడ్డంతో కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు.
The majestic #RajaSaab looks absolutely stunning 🔥
Our Rebel Star #Prabhas in a never-before-seen avatar.Wishing our DEVA a very Happy Birthday – Team #Salaar pic.twitter.com/OZG6ulVkdj
— Salaar (@SalaarTheSaga) October 23, 2024
ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాకు ప్రభాస్ ఎంత పారితోషకం తీసుకుంటున్నారో తెలుసా? సాధారణంగా ఒక సినిమా కోసం ప్రభాస్ రూ. 150 కోట్లు పారితోషకం తీసుకుంటారు. కానీ ఈసారి Raja Saab కోసం ఆయన కేవలం రూ. 100 కోట్లకే ఒప్పుకున్నారని సమాచారం. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలకు సాయం చేయడమే లక్ష్యంగా ఆయన తీసుకున్న నిర్ణయం.
ఇక ఇటీవల ప్రభాస్ నటించిన “కల్కి 2899 AD” చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల మార్కును దాటడంతో ఆయన సక్సెస్ స్ట్రీక్ భారీగా కొనసాగుతుంది.
Read More: Amaravati Drone Summit బద్దలు కొట్టిన అయిదు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఏంటో తెలుసా?