HomeTelugu Big Storiesహనుమంతుని సీట్లో కూర్చున్న వ్యక్తిపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దాడి

హనుమంతుని సీట్లో కూర్చున్న వ్యక్తిపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దాడి

Aadipurush 1

ఈ రోజు సోషల్‌ మీడియా మొత్తం ప్రభాస్ కీలక పాత్రలో వచ్చిన ఆదిపురుష్ గురించే వార్తలు వినిపిస్తున్నాయి. నేడు శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైన రోజే హైదారాబాద్‌లో ఇద్దరు వ్యక్తులపై దాడులు జరిగాయి. సినిమా బాగాలేదన్నందుకు ఐమ్యాక్స్‌ థియేటర్లో ఓ వ్యక్తిపైన, హనుమంతుడికి కేటాయించిన సీట్లో కూర్చున్నందుకు భ్రమరాంబ థియేటర్‌లో ఓ వ్యక్తిపైన ప్రభాస్‌ అభిమానులు దాడులకు పాల్పడ్డారు.

ఆదిపురుష్ సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రదర్శింపబడుతున్న అన్ని థియేటర్‌లలో హనుమంతుడి కోసం ఒక్కో సీటును ఖాళీగా విడిచిపెడుతున్నారు. ఆ సీటుపై కాషాయం వస్త్రం కప్పి, సీట్లో పూలు, పండ్లు పెట్టి ఉంచుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్‌లో కూడా హనుమంతుడి కోసం ఒక సీటును విడిచిపెట్టారు.

అయితే ఈ సినిమా చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి హనుమంతుడికి కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. అతనిని చూసిన ప్రభాస్ అభిమానులు అక్కడకు వచ్చి అతనిని సీట్లో నుండి లేవమని చెప్పారు. ఈ సందర్భంగా వాదన జరిగింది. కాసేపటికి అతనిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ప్రేక్షకుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu