పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారని అన్నారు. గోపీచంద్ హీరోగా నటించిన ‘సీటీమార్’ సినిమా విజయంపై ప్రభాస్ తాజాగా స్పందించారు. “సీటీమార్’తో నా స్నేహితుడు బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. నాకెంతో ఆనందంగా ఉంది. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఫలితం గురించి కంగారులేకుండా ఇలాంటి పెద్ద చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన టీమ్ మొత్తానికి నా అభినందనలు’ అని ప్రభాస్ పేర్కొన్నారు.
మహిళా కబడ్డీ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్’. సంపత్‌నంది దర్శకత్వం వహించారు. తమన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. భూమిక, రావు రమేశ్, తణికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు. ఇందులో గోపీచంద్ కబడ్డీ కోచ్ పాత్ర పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు.
View this post on Instagram