యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరో అంటూ అంతా అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా సమానమైన క్రేజ్ ప్రభాస్‌కు మాత్రమే ఉంది. అందుకే ఆయన్ను ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి బిగ్‌స్టార్ తనలోని లోపాన్ని తానే స్వయంగా ఒప్పుకోవడం చర్చనీయాంశం అవుతుంది. ఏ హీరో కూడా తన లోపాన్ని తానే ఒప్పుకోడు.
కానీ ప్రభాస్ మాత్రం తనలో ఉన్న ఒక లోపంను చెప్పుకొచ్చాడు. చాలా కాలంగా ప్రభాస్ గొంతు గురించి విమర్శలు ఉన్నాయి. పవర్ ఫుల్ డైలాగ్స్‌ను కూడా లో పిచ్‌లో చెప్తాడనే టాక్ ఉంది. అందుకే ఆయన కొన్ని సీరియస్ డైలాగ్స్ చెప్పిన సమయంలో ఆ సీరియస్ నెస్ కనిపించదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. తన గొంతుకు సంబంధించి ఉన్న లోపాన్ని సరి చేసుకునేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు. త్వరలోనే ఆ సమస్య నుండి తాను బయటకు వచ్చి పవర్ ఫుల్ గొంతుతో డబ్బింగ్ చెప్తానంటూ హామీ ఇచ్చాడు.