HomeTelugu Trendingసైలెంట్‌గా పెళ్లికి రెడీ అవుతున్న ‘బుజ్జిగాడు’ హీరోయిన్!

సైలెంట్‌గా పెళ్లికి రెడీ అవుతున్న ‘బుజ్జిగాడు’ హీరోయిన్!

Prabhas Bujjigadu actress
టాలీవుడ్‌లో ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజనా గల్రాని. ఆ తరువాత పలు సినిమా నటించినప్పటికీ .. ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా రాణించలేకపోయింది. కన్నడ నాట మాత్రం అవకాశాలు బాగానే ఉన్న సమయంలోనే డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత తన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని చెబుతున్నారు. త్వరగా పెళ్లిచేసుకొని సినిమా జీవితానికి గుడ్ బై చెప్పాలని చూస్తోందట. అందుతున్న సమాచారం ప్రకారం.. డాక్టర్ పాషా అనే వ్యక్తిని సంజనా వివాహమాడబోతున్నట్టు సమాచారం. వీరి నిశ్చితార్ధం కూడా ఇప్పటికే జరిగిపోయిందని ఈ వేసవిలో ఒక్కటవ్వడం ఖాయమని శాండల్ వుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లికి చాలా తక్కువ మందిని ఆహ్వానించబోతున్నారని వీరిలో బంధువులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఉంటారని సమాచారం. అయితే.. ఈ విషయంపై సంజనా ఇప్పటి వరకు స్పందించలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu