టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తన సహనటి శ్రద్ధా కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెప్పారు. వీరిద్దరు కాంబినేషన్లో ‘సాహో’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. శ్రద్ధ మంగళవారం తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా డార్లింగ్ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘నా స్వీటెస్ట్ అమృత (‘సాహో’లో శ్రద్ధ పాత్ర పేరు)కు హ్యాపీ బర్త్‌డే’ అంటూ సినిమాలో స్టిల్‌ను షేర్ చేశారు. సోషల్ మీడియాలో చాలా తక్కువగా వాడే ప్రభాస్ ఈ పోస్ట్ చేయడం ప్రత్యేకం. అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.
పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా శ్రద్ధను విష్ చేశారు. ‘నా సహ నటి, స్నేహితురాలు శ్రద్ధా కపూర్. ‘బాఘీ 3′ సినిమాలో నీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడు నీపై ప్రేమను, సంతోషాన్ని కురిపించాలని కోరుకుంటున్నా’ అని బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ పోస్ట్ చేశారు.
శ్రద్ధ సోదరుడు సిద్ధార్థ్ కపూర్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ఏంజెల్‌కు హ్యాపీ బర్త్‌డే. నువ్వు నాతోడు ఉంటే జీవితం ఎంతో బాగుంటుంది. నువ్వు ఎక్కడున్నా ప్రేమను, సంతోషాన్ని నింపుతుంటావు. నీ నటనతో ఈ ప్రపంచంలోని ఎంతో మంది నవ్వుకు కారణం అయ్యావు. ఐ లవ్యూ’ అంటూ వీడియో షేర్ చేశారు.