HomeTelugu Big Storiesకేజీఎఫ్‌ డైరెక్టర్‌తో ప్రభాస్ 'సలార్'

కేజీఎఫ్‌ డైరెక్టర్‌తో ప్రభాస్ ‘సలార్’

Prabhas and prashanth neelయంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ సినిమా తరువాత వరుసగా భారీ బడ్జెట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న ప్రభాస్.. త్వరలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’లో ప్రభాస్ నటించబోతున్నాడు. ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ స్టార్లు నటించనున్నారు. మరోవైపు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ చేయబోతున్న మరో సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది.

‘కేజీఎఫ్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ తరుపరి ప్రాజెక్టును చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితం వెలువడింది. ‘సలార్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని హొంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించబోతున్నారు. మాఫియా డాన్ కథతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్ కూడా పోస్టర్ కూడా దీనినే వివరిస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందో తెలియాల్సి ఉంది.

pra

Recent Articles English

Gallery

Recent Articles Telugu