HomeTelugu Big Storiesప్రభాస్‌ పూజాహెగ్డేతో మాట్లాడటం లేదా!

ప్రభాస్‌ పూజాహెగ్డేతో మాట్లాడటం లేదా!

Prabhas and pooja hegde not

పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌, పూజాహెగ్డే హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న అపురూప ప్రేమకావ్యం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ మేరకు చిత్రబృందం నిర్మాణ, నిర్మాణాంతర పనుల్లో ఫుల్‌ బిజీగా పాల్గొంటుంది. కాగా, తాజాగా ప్రభాస్‌-పూజాహెగ్డే సరిగ్గా మాట్లాడుకోవడం లేదని సోషల్‌ మీడియా టాక్‌. పూజా ప్రవర్తన నచ్చకపోవడం వల్లే ప్రభాస్‌ ఆమెకు దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సదరు వార్తలపై తాజాగా ‘రాధేశ్యామ్‌’ టీమ్‌ స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పింది. వాళ్లిద్దరూ చక్కగా మాట్లాడుకుంటున్నారని.. ఒకరిపై మరొకరికి అభిమానం ఉందని టీమ్‌ చెప్పింది. ఆఫ్‌స్క్రీన్‌లో వాళ్లిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని ఆ బంధమే ఆన్‌స్క్రీన్‌లోనూ కొనసాగిందని వివరించింది. పూజా చక్కని సమయపాలన పాటిస్తుందని చెప్పిన సమయానికి సెట్‌లో ఉంటుందని ఆమె మంచి నటి అని టీమ్‌ వివరించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu