HomeTelugu Big Storiesప్రభాస్‌- కృతిసనన్‌ ఎంగేజ్మెంట్ ఎప్పుడో తెలుసా‌!

ప్రభాస్‌- కృతిసనన్‌ ఎంగేజ్మెంట్ ఎప్పుడో తెలుసా‌!

Prabhas and kriti sanon eng
టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ల్లో ప్రభాస్‌ ఒకరు. ఆయన పెళ్లిపై పలు వార్తలు సోషల్‌ మీడియాలో తరుచూ వైరల్‌ అవుతునే ఉంటాయి. ప్రభాస్‌ పెళ్లి కోసం ఫ్యాన్స్‌ ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రభాస్‌ పెళ్లి సంబంధించిన ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్‌ నటి కృతి సనన్‌- ప్రభాస్‌ డేటింగ్‌లో ఉన్నారు అనే వార్తలు గతకొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ లో నటించిన వీరిద్దరూ సీతా- రాముడిగా నటిస్తున్నారు. అయితే ఆదిపురుష్ ప్రచారాల్లో భాగంగా ప్రభాస్, కృతి సనన్ చాలా దగ్గరగా వున్నారని, కృతి సనన్ ప్రభాస్ ని చాలా బాగా చూసుకుందని కూడా వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో బాలీవుడ్‌ క్రిటిక్‌ ఉమైర్ సంధు చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రభాస్ కి కృతి సనన్ కి వచ్చే వారం ఎంగేజ్మెంట్ జరగబోతోంది అని ఒక న్యూస్ పెట్టాడు. అదీ ఇక్కడ ఇండియా లో కాదు, మాల్దీవ్స్ అని పెట్టాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు పెట్టొదు అని కొందరూ, నిజమేనా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇది ఇలాఉంటే.. ఉమైర్‌ సంధు బాలీవుడ్‌ సెలబ్రెటీల వ్యక్తికత విషయాల గురించి ట్వీట్లు చూస్తూ ఇప్పటికే పలు మార్లు వివాదంలో చిక్కుకుంటాడు. దీంతో పలువురు ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu