ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజా షెడ్యూల్ ముంబైలో చిత్రీకరిస్తున్నారు. కరోనాకు ముందు 30 శాతం షూటింగ్ పూర్తయిందని దర్శకుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముంబైలో వేసిన రావణ లంక సెట్‌లో కొన్ని సన్నివేశాలు సైఫ్ అలీఖాన్‌పై షూట్ చేస్తున్నారు. రామాయణ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఆది పురుష్ 3డీ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు ఓంరౌత్ ఎంతగానో కష్టపడుతున్నారు.