HomeTelugu Big Stories“ప్రభాస్ 25” మూవీ అప్డేట్

“ప్రభాస్ 25” మూవీ అప్డేట్

Prabhas 25 movie official a

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే “ప్రభాస్ 25” అప్డేట్ నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్ 47న ప్రకటిస్తామని టి సిరీస్ ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 11 గంటలకు “ప్రభాస్ 25” ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన వివరాలతో పాటు టైటిల్ ను కూడా విడుదల చేసింది.

ఈ సినిమాకు “స్పిరిట్” అనే టైటిల్ ను ఫిక్స్‌ చేశారు. యూవీ క్రియేషన్స్, టి సిరీస్ తో కలిసి భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను రూపొందించనుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా, భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, కృష్ణ కుమార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి రెబల్ స్టార్ ప్రకటించారు. మొదటి ప్రకటనతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశారు. కాగా మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Prabhas Joins Forces With Sandeep Reddy Vanga For 'Spirit'

Recent Articles English

Gallery

Recent Articles Telugu