HomeTelugu Big StoriesPrabhas: క్షణం తీరిక లేకుండా బాహుబలి.. ఎందుకంటే..

Prabhas: క్షణం తీరిక లేకుండా బాహుబలి.. ఎందుకంటే..

Prabhas to work on three projects simultaneously
Prabhas to work on three projects simultaneously

Prabhas Upcoming Movies:

Prabhas త్వరలో మూడు సినిమాల షూటింగ్స్‌ను ఒకేసారి ప్రారంభించబోతున్నారు. రాజాసాబ్ చిత్రీకరణ ఈ ఏడాది నవంబర్‌లో పూర్తవుతుందని భావిస్తున్న నేపథ్యంలో, ఆ వెంటనే ప్రభాస్ మూడు పెద్ద ప్రాజెక్టులపై పనిచేయడానికి సిద్ధమవుతున్నారు.

కల్కి2898AD పార్ట్ 2కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా, స్పిరిట్‌ కి సందీప్ వంగా దర్శకత్వం వహించనున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రభాస్ హను రాఘవపూడి సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత ప్రారంభమవుతాయి. అయితే ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాల్లో షూటింగ్‌లను ప్యారలల్‌గా పాల్గొనబోతున్నరు.

రాజాసాబ్ 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది. స్పిరిట్ సినిమా 2026 లేదా 2027లో విడుదల అవుతుందని అంచనా. కల్కి 2898 AD పార్ట్ 2 2027 లేదా 2028లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ హను చిత్రం 2025 చివర్లో లేదా 2026 మధ్యలో విడుదల కావచ్చని టాక్ నడుస్తోంది.

ఇతర ప్రాజెక్టుల సంగతికి వస్తే.. సలార్ 2 – శౌర్యంగా పర్వం కోసం ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని సమాచారం. ఇలా వరుస సినిమా షూటింగ్స్ తో ప్రభాస్ క్షణం కూడా తీరిక లేకుండా గడపబోతున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu