టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘అసుర అసుర అసుర అసుర.. రావణాసుర..’ అంటూ ‘జై లవ కుశ’ సినిమాలోని ఓ పాటలో తన వీరత్వాన్ని చూపిస్తారు. కాగా ఇప్పుడు ‘అసుర’ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) సందర్భంగా రెండు భారీ సినిమాల ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి కొరటాల శివతో (ఎన్టీఆర్ 30వ చిత్రం) కాగా, మరొకటి ప్రశాంత్ నీల్‌తో. ముందుగా ఎన్టీఆర్–కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్.. ప్రశాంత్ సినిమా సెట్స్ పైకి వెళుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘అసుర’ లేదా ”అసురుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట మూవీ యూనిట్. దీనిలో నిజం ఎంత ఉందో తెలియాలంటే వేచి చూడాలి.