జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆ వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఇటీవలే డాక్టర్లను కలిశారు. అయితే, డాక్టర్లు పరీక్షించి.. నొప్పి ముదరక ముందే సర్జరీ చేయాలని సూచించారట. కాగా, సర్జరీపై రెండు మూడు రోజులపాటు ఆలోచించిన పవన్ కళ్యాణ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సర్జరీ చేయించుకోకూడదని, నేచర్ క్యూర్ పద్దతిలోనే వెన్నునొప్పిని తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. కొంతకాలం పాటు పార్టీ పనులను పక్కన పెట్టి నేచర్ క్యూర్ పద్దతిలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. పవన్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే.. కొన్ని రోజులపాటు పార్టీకి అందుబాటులో ఉండరన్నమాట.