ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలకృష్ణ, చిరంజీవి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలకు తనను ఆహ్వానించకపోవడంపై బాలయ్య అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలసిందే. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ రచయత, నిర్మాత, దర్శకుడు,నటుడు అయిన పోసాని కృష్ణమురళి స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లడుతు.. టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలతో పాటు బాలయ్య, చిరంజీవి వివాదంపై స్పందించాడు. బాలకృష్ణ గురించి మాట్లాడుతూ… ఆయనతో నేను పలు సినిమాలకు రచయతగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు బాలయ్యతో రెండు మూడు సినిమాల్లో కలిసి నటించిన విషయాన్నిఈ సందర్భంగా ప్రస్తావించారు.
బాలకృష్ణకు కోపం కాస్తా ఎక్కువే అన్నారు. అంతేకాదు ఆయన కోపానికి కారణం కూడా ఉంటుంది. వ్యక్తిగతంగా ఆయన ఎవరిని ఏమి అనరు. ముఖానికి ముసుకేసుకోవడం ఆయనకు తెలియదన్నారు. ఏది ఉన్నా ముఖం మీదే అనేస్తారు. మంచికి మంచి… చెడుకి చెడు. మేకప్ ఉంటే ఒకలా.. మేకప్ లేకపోతే మరోలా ఉండరన్నారు. చిన్నోడు పెద్దోడు అని తేడా చూడరు. సీఎం అయినా.. చిన్నావాళ్లైనా అందిరినీ ఒకేలా గౌరవిస్తాన్నారు పోసాని. మనకు ఏదైనా జెన్యూన్ ప్రాబ్లెమ్ ఉంటే వెంటనే స్పందిస్తారన్నారు. చాలా డీసెంట్ మనిషి. అవినీతి అక్రమాలు అనేవి బాలయ్యలో లేవు. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న బాలయ్యతో పాటు ఆయన అన్నదమ్ములు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. నాన్న రాజకీయాన్ని ఎపుడు పైరవీలకు వాడుకోలేదు. ఎన్టీఆర్ కొడుకులు ఇప్పటికీ అందరు కష్టపడే డబ్బులు సంపాదించుకుంటున్నారన్నారు. ఆయాచితంగా వాళ్లు ఏది ఆశించడం వారిలో చూడలేదన్నారు. ఇకపోతే పోసాని.. చిరంజీవితో నాకు మంచి అనుబంధమే ఉందన్నారు. ఆయనతో నేను ఖైదీ నంబర్ 150 సినిమా చేసానన్నారు. ఆయన హీరోగా నటించిన అల్లుడా మజాకా సినిమాకు నేను కథను అందించానన్నారు. ఆయనకు నేనంటే ఎంతో ఇష్టమన్నారు. నా యాక్టింగ్ అంటే ఆయకు ఇష్టమన్నారు. ఆయన కూడా కష్టపడే పైకొచ్చారని పోసాని చెప్పుకొచ్చారు.