ఒకప్పటి హీరోలు ఇప్పుడు విలన్లుగా మారుతున్న తరుణంలో గాయకులు సైతం విలన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె ఇప్పుడు విలన్గా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా ఈమధ్య బాగా ట్రెండ్ అయిన ‘పలాస 1978’ అనే చిత్రంలో కావడం విశేషం. రఘు కుంచె చేస్తున్నది సాదా సీదా విలన్ పాత్ర కాదట.. ఇందులో నాలుగు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.